Tuesday, February 10, 2015

చరిత్రలో ఈ రోజు;ఫిబ్రవరి 11

చరిత్రలో ఈ రోజు;ఫిబ్రవరి 11

1847 : ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం.

ఏ వ్యక్తి అయినా ఏక కాలంలో వందల కొద్దీ ఆవిష్కరణలను 


కొనసాగించలేడు. అందునా సాస్త్రీయ ఆవిష్కరణలంటే సామాన్యమైన 

విషం కాదు. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ విషయం వేరు. 1000 

పేటెంట్లకు హక్కులు కలిగి ఉండటం ఆయన ఒక్కడికే చెల్లింది


1878 లో ఎలక్ట్రిక్ బల్బ్ ను రూపొందించాడు


1887-1889 మధ్య కాలంలో టైప్ రైటర్ , ఎలక్ట్రిక్ పెన్ , గ్రామ ఫోన్ , 

మోషన్ పిక్చర్ కెమేరా , అలాగ ఎన్నింటినో యీయన 

రూపొందిచారు

Saturday, January 31, 2015

చరిత్రలో ఈ రోజు;ఫిబ్రవరి 1

చరిత్రలో ఈ రోజు;ఫిబ్రవరి 1

1956 : ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు 


కన్నెగంటి బ్రహ్మానందం జననం.

'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం అత్తిలి లో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
వివిధ భాషలలో 900 కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం గిన్నీస్ ప్రపంచ రికార్డులు(2008వ సంవత్సరం)వారు గుర్తించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.






2003 : అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా దుర్ఘటనలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణం.

1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.
376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు.
1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా" కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు.






1971 : క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా జననం.

భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. పాకిస్తాన్ పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు వకార్ యూనిస్ యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన షార్జా లో ఇంగ్లాండు పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. 
1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు.


Sunday, September 14, 2014

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15
చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15
This Day in History September 15
భక్తప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది.
ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.

అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15
చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15
This Day in History September 15
ఇంజనీర్ల దినోత్సవము.
భారతదేశం లో, ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15 న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి మరియు 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల మరియు త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు. ఈయనకు పేరు తెచ్చిన పథకాలలో కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట మరియు దానికి ఆనుకొని వున్న బృందావన ఉద్యానవనం, భద్రావతి ఇనుము మరియు ఉక్కు కర్మాగారం, మైసూర్ చందనపునూనె కర్మాగారం మరియు బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపనచరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15
చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15
This Day in History September 15
birth of Marco Polo
1254 : ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మార్కో పోలో జననం
Marco Polo ఒక సాహస యాత్రికుడు ఇతను వెనిస్ కు చెందినవాడు.. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి


చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్‌ 15


1967 : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా నటీమణి రమ్యకృష్ణ జననం... కొంతకాలం క్రితం తెలుగు చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన కథానాయక రమ్యకృష్ణ. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త.

Thursday, August 28, 2014

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 29

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 29

Birthday Of AKKINENI NAGARJUNA
1959 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత అక్కినేని నాగార్జున జననం.



చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 29
Birthday of Michael Jackson 
1958 : అమెరికా కు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ జననం..
ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. జాక్సన్ US$ 

300మిలియన్ల దానధర్మాలు చేసాడు.. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (Thriller) 

జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై 

ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం లో ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 

అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్..


చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 29
జాతీయ క్రీడా దినోత్సవము - క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి..

1936 బెర్లిన్ ఒలంపిక్స్ లో అతని ఆటను వీక్షించిన తర్వాత అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్ కు, బ్రిటిష్ ఇండియన్

ఆర్మీలో మేజర్ పదవిని, జర్మన్ పౌరసత్వాన్ని మరియు అతనిని కల్నల్ హోదాకు పంపే ఆఫర్ ను అందించాడు 

(ధ్యాన్ చంద్ తరువాత దానిని తిరస్కరించాడు).

టోక్యో ఒలంపిక్స్ అధికారులు ఇతని హాకీ స్టిక్ ని విరిచి దానిలో అయస్కాంతం ఉన్నదేమో అని చూశారు. 

ఆశ్చర్యకరంగా దానిలో ఏమీ కనుగొనలేకపోయారు, చివరకు ఇది జిగురు యొక్క ఫలితమని తెలిపారు.


Tuesday, August 19, 2014

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 20:

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 20:
1944 : భారతదేశ ఆరవ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జననం




ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984 , అక్టోబరు 31 న తల్లి మరణముతో ... 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు(ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు
 



చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 20:
1946 : భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త, సాఫ్టువేరు ఇంజనీరు మరియు ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు నారాయణమూర్తి జననం.

 చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 20:
1931 : ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు బి. పద్మనాభం జననం



Wednesday, August 6, 2014

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 6:

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 6:
చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 6:

1991 :వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్‌నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి సర్ టిమ్ బెర్నెర్స్ లీ.

Tim Berners-Lee inventor of the World Wide Web..




చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 6:


1881 - నోబెల్ బహుమతి గ్రహీత, పెన్సిలిన్ కనిపెట్టిన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం

discoverer of penicillin Sir Alexander Fleming birth day.

Bacterial Resistance to Antibiotics
 

మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది. 



చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 6:

1945 - రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికా , జపాను లోని హిరోషిమా నగరం మీద అణుబాంబు ప్రయోగించింది. ప్రపంచ హిరోషిమా రోజు" గా పాటిస్తారు.

Atomic bomb mushroom clouds over Hiroshima

Saturday, August 2, 2014

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 2:

Welcome August



చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 2:

1979 : Devi Sri Prasad Birthday

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత దేవి శ్రీ ప్రసాద్ జననం.



Innovative Idea: 
colored tape on the carpet to make roads for your kid’s toy cars


The right way.