చరిత్రలో ఈ రోజు;ఫిబ్రవరి 1
1956 : ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు
కన్నెగంటి బ్రహ్మానందం జననం.
'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం అత్తిలి లో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
వివిధ భాషలలో 900 కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం గిన్నీస్ ప్రపంచ రికార్డులు(2008వ సంవత్సరం)వారు గుర్తించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.
2003 : అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా దుర్ఘటనలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణం.
1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.
376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు.
1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా" కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు.

1971 : క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా జననం.
భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. పాకిస్తాన్ పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు వకార్ యూనిస్ యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన షార్జా లో ఇంగ్లాండు పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు.
1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు.