Wednesday, July 9, 2014

చరిత్రలో ఈ రోజు/జూలై 9

చరిత్రలో ఈ రోజు/జూలై 9

1969: భారత వన్యప్రాణి బోర్డు, పులి ని జాతీయ జంతువు గా ప్రకటించింది.


birth day ; Venkatapati raju 

1969 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతి రాజు జననం.


చరిత్రలో ఈ రోజు/జూలై 9

1927 : తెలుగు సినిమా రంగంలో గుమ్మడి గా పేరు పొందిన గుమ్మడి
 వెంకటేశ్వరరావు జననం..

గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే

 అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు 

చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, 

సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా

 అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా 

దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల 

వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను

 మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి 

పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల 

పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి

 వెంకటేశ్వరరావు.

1875 : బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.
స్టాక్ మధ్యవర్తులకు మరియు వ్యాపారులకు సంబంధించిన వాణిజ్య నిల్వలు, బాండ్లు, మరియు భద్రతలకు సంబంధించిన సేవలను అందించే స్టాక్ ఎక్స్‌ఛేంజ్
.

Monday, July 7, 2014

చరిత్రలో ఈ రోజు/జూలై 7

చరిత్రలో ఈ రోజు/జూలై 7
HAPPY BIRTH DAY GANGULY
1972 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ జననం.
టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్ మరియు కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీ కి బెంగాల్ టైగర్ , కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు.


చరిత్రలో ఈ రోజు/జూలై 7
HAPPY BIRTH DAY YSR
1949 : ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, వై.యస్. రాజశేఖరరెడ్డి జననం . రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు .. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.







My Dubai trip
దుబాయ్ ట్రిప్ :07JULY
నిన్న desert safari కి బుక్ చేసాం. డ్రైవర్ తీసుకొచ్చిన వెహికిల్ ఒక 7 సీటర్ SUV. సిటీ దాటి దాదాపు 45 - 50 నిమిషాలు ప్రయాణం చేసి కొంచెం చిన్న ఊరు లాంటి ప్రదేశానికి చేరుకున్నాం.సిటీ లో ఎక్కడ చుసిన చాల ఎత్తైన buildings .. చాల costly vehicles వున్నాయి .. వహ్ great city . ..dubai ఎడారి లోకి వెఅంటే అందరికి చాల నచ్చే ఇంటర్నేషనల్ సిటీ ..ఎడారి లోకి వెల్తున్నాం కదా ఇప్పుడు అందుకని టైర్స్‌లో గాలి తగ్గిస్తున్నారట. అప్పుడు తక్కువ ప్రెషర్ ఉండి, ఆ ఇసుకలో డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉంటుందట.లేకపొతే పడిపోయే ప్రమాదం ఉంటుందట. అక్కడికి కొంచెం దూరం లోనే ఎడారి మొదలవుతుంది కాబట్టి ఇక్కడే గాలి తగ్గించేస్తున్నామని చెప్పాడు. అక్కడ చాలా వాహనాలు ఆగి ఉన్నాయి, అన్నిట్లోనూ అలాగే చేస్తున్నారు.
ఆ తర్వాత రయ్యిమని బండిని ఇసుకలోకి తీస్కెళ్లాడు.అలా తీస్కెళ్లడం తీస్కెళ్లడం గంట వరకు ఆపకుండా గాల్లో నడిపినట్టు డ్రైవ్ చేసాడు. నాకైతే సగం సేపు బండి పడిపోతుందేమో, ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుకలో జారిపోతుందేమో అనిపించింది. ఒక్కోసారి పక్కకి తిప్పినప్పుడు ఇసుక బండి కన్నా పైకి లేచి, కార్ అద్దాలన్నీ మూసుకుపోయి ఇసుకలో మునిగిపోతున్నామేమో అనిపించింది.అలా గంట సేపు తిప్పి తిప్పి ఎడారి మధ్యలో ఒకచోట ఆపాడు. ఈలోపు ఇంకో 3,4 ఇలాంటి వెహికిల్స్ కూడా వచ్చి ఆగాయి. .అక్కడి నుండి తీసుకెళ్ళి మమ్మల్ని ఎదారి మధ్యలో ఉన్న ఒక క్యాంప్‌లో దింపాడు. అప్పటికే అక్కడ చాలా వాహనాలున్నాయి.ఒక్కొక్క బండిలో వచ్చిన వాళ్లందరికి కలిపి ఒక table ఉంటుదనీ, మా table నంబర్ చెప్పి, అక్కడికెళ్ళి మేం ఐదుగురం కూర్చోవచ్చనీ చెప్పాడు. camel ride, టీ, రాత్రి భోజనం టూర్ ప్యాకేజిలో ఫ్రీ అని, ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి.. స్టాల్. వాళ్ళ దగ్గర కొన్ని బుర్ఖాలు, షేక్ డ్రెస్సులూ ఉన్నాయి. వచ్చినప్పుడే అనుకున్నా బుర్ఖాతో ఫొటో తీసుకుంటే బావుండు అని. యాహూ... అనుకొని వెళ్ళి టక్కున బుర్ఖా వేసుకొని నిల్చున్నా. మా బ్రదర్ చిట్టి camara తీసుకుని నన్ను , మా నాన్న కి డ్రెస్ వేసి ఫొటోస్ తీసాడు .. మను కూడా ఫుల్ గ డ్రెస్ వేసుకుని అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ దిగాము ..ఎడారి ఇసకలో స్కేట్టింగ్ చేసాము ... ఇసకలో కిందకు అల జారుకుంటూ వెళ్ళాము .. థ్రిల్లింగ్ గ వుంది .. చాలామంది ఫారినర్స్ వచ్చారు .. వాళ్ళు మాతో పాటు అలానే చేసారు ,మా table దగ్గర కూర్చున్నాం. ఈలోపు ఒక షేక్ falcon ని పట్టుకొని అక్కడికొచ్చాడు. అతని దగ్గరికెళ్లి దాన్ని పట్టుకొని ఒక ఫొటో తీసుకున్నాం.ఒక పరుపు లాంటిది కొంచెం ఎత్తులో వేసి, దాని చుట్టు దిండుల్లాంటివి వేసారు. వాటన్నిటినీ ఒక స్టేజ్ చుట్టూ వేసారు.సాయంత్రం కావడంతో ఎడారి లో ఉన్నా హాయిగా చల్లగా మంచి వాతావరణం ఉంది. .ఒకతను డ్యాన్స్ ప్లస్ జిమ్నాస్టిక్స్ టైపులో డాన్సు చేసాడు .. చాల బావుంది .. మను కూడా స్టేజి మిద డాన్సు చేసాడు .. ఫన్నీ గ వుంది ..భోజనం వచ్చి తీస్కెళ్లమని అనౌన్స్ చేసారు.భోజనం కూడా పర్లేదు బానే ఉంది.తినే సరికి రాత్రి 9 అయింది. అందరితో పాటే బయటికి వెళ్ళి మా డ్రైవర్‌ని వెతికి పట్టుకొని రిటర్న్ బయల్దేరాం.
desert safari ఫుల్ గ ఎంజాయ్ చేసాం .. thanks to my brother చిట్టి & his family ,.. manu and sujatha..







Thursday, July 3, 2014

చరిత్రలో ఈ రోజు/జూలై 4

చరిత్రలో ఈ రోజు/జూలై 4:

1963: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మరణం..

1.పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో జననం...
2.మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.
3.19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.
4.1916 లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు
5.వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం
6.కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ {వ్యాఖ్య" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు}.
7.జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది






చరిత్రలో ఈ రోజు/జూలై 4:


1902: ప్రసిద్ధి గాంచిన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద మరణం..


భారతదేశాన్ని ప్రేమించి,భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని


 పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా.అమెరికాలోని

 ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.తిరిగి భారత 

దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా

 నిర్దేశం చేశాడు.


చరిత్రలో ఈ రోజు/జూలై 4:

1933 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జననం.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన 


రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును 

ప్రవేశపెట్టాడు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం 

విశేషం.బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినాడు



చరిత్రలో ఈ రోజు/జూలై 4:

1897: భారత స్వాతంత్ర్యసమరయోధుడు అల్లూరి సీతారామరాజు జననం..

ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక 


అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని 

కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ 

వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన 

అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా

 శక్తిని ఢీకొన్నాడు. 





చరిత్రలో ఈ రోజు/జూలై 4:

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం..

Independence Day in the United States 

అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్రోద్యమం పేరిట బ్రిటిష్


 సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల 

స్వాతంత్ర యుద్ధంగా గుర్తింపు పొందింది..




Wednesday, July 2, 2014

చరిత్రలో ఈ రోజు/జూలై 3:

చరిత్రలో ఈ రోజు/జూలై 3:

1918 : తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జన్మించారు...

Born: July 3, 1918, nuzvidu 






చరిత్రలో ఈ రోజు/జూలై 3:

1980 : భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జననం.

టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్