Monday, July 7, 2014

చరిత్రలో ఈ రోజు/జూలై 7

చరిత్రలో ఈ రోజు/జూలై 7
HAPPY BIRTH DAY GANGULY
1972 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ జననం.
టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్ మరియు కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీ కి బెంగాల్ టైగర్ , కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు.


చరిత్రలో ఈ రోజు/జూలై 7
HAPPY BIRTH DAY YSR
1949 : ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, వై.యస్. రాజశేఖరరెడ్డి జననం . రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు .. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.







My Dubai trip
దుబాయ్ ట్రిప్ :07JULY
నిన్న desert safari కి బుక్ చేసాం. డ్రైవర్ తీసుకొచ్చిన వెహికిల్ ఒక 7 సీటర్ SUV. సిటీ దాటి దాదాపు 45 - 50 నిమిషాలు ప్రయాణం చేసి కొంచెం చిన్న ఊరు లాంటి ప్రదేశానికి చేరుకున్నాం.సిటీ లో ఎక్కడ చుసిన చాల ఎత్తైన buildings .. చాల costly vehicles వున్నాయి .. వహ్ great city . ..dubai ఎడారి లోకి వెఅంటే అందరికి చాల నచ్చే ఇంటర్నేషనల్ సిటీ ..ఎడారి లోకి వెల్తున్నాం కదా ఇప్పుడు అందుకని టైర్స్‌లో గాలి తగ్గిస్తున్నారట. అప్పుడు తక్కువ ప్రెషర్ ఉండి, ఆ ఇసుకలో డ్రైవ్ చెయ్యడానికి వీలుగా ఉంటుందట.లేకపొతే పడిపోయే ప్రమాదం ఉంటుందట. అక్కడికి కొంచెం దూరం లోనే ఎడారి మొదలవుతుంది కాబట్టి ఇక్కడే గాలి తగ్గించేస్తున్నామని చెప్పాడు. అక్కడ చాలా వాహనాలు ఆగి ఉన్నాయి, అన్నిట్లోనూ అలాగే చేస్తున్నారు.
ఆ తర్వాత రయ్యిమని బండిని ఇసుకలోకి తీస్కెళ్లాడు.అలా తీస్కెళ్లడం తీస్కెళ్లడం గంట వరకు ఆపకుండా గాల్లో నడిపినట్టు డ్రైవ్ చేసాడు. నాకైతే సగం సేపు బండి పడిపోతుందేమో, ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుకలో జారిపోతుందేమో అనిపించింది. ఒక్కోసారి పక్కకి తిప్పినప్పుడు ఇసుక బండి కన్నా పైకి లేచి, కార్ అద్దాలన్నీ మూసుకుపోయి ఇసుకలో మునిగిపోతున్నామేమో అనిపించింది.అలా గంట సేపు తిప్పి తిప్పి ఎడారి మధ్యలో ఒకచోట ఆపాడు. ఈలోపు ఇంకో 3,4 ఇలాంటి వెహికిల్స్ కూడా వచ్చి ఆగాయి. .అక్కడి నుండి తీసుకెళ్ళి మమ్మల్ని ఎదారి మధ్యలో ఉన్న ఒక క్యాంప్‌లో దింపాడు. అప్పటికే అక్కడ చాలా వాహనాలున్నాయి.ఒక్కొక్క బండిలో వచ్చిన వాళ్లందరికి కలిపి ఒక table ఉంటుదనీ, మా table నంబర్ చెప్పి, అక్కడికెళ్ళి మేం ఐదుగురం కూర్చోవచ్చనీ చెప్పాడు. camel ride, టీ, రాత్రి భోజనం టూర్ ప్యాకేజిలో ఫ్రీ అని, ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి.. స్టాల్. వాళ్ళ దగ్గర కొన్ని బుర్ఖాలు, షేక్ డ్రెస్సులూ ఉన్నాయి. వచ్చినప్పుడే అనుకున్నా బుర్ఖాతో ఫొటో తీసుకుంటే బావుండు అని. యాహూ... అనుకొని వెళ్ళి టక్కున బుర్ఖా వేసుకొని నిల్చున్నా. మా బ్రదర్ చిట్టి camara తీసుకుని నన్ను , మా నాన్న కి డ్రెస్ వేసి ఫొటోస్ తీసాడు .. మను కూడా ఫుల్ గ డ్రెస్ వేసుకుని అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ దిగాము ..ఎడారి ఇసకలో స్కేట్టింగ్ చేసాము ... ఇసకలో కిందకు అల జారుకుంటూ వెళ్ళాము .. థ్రిల్లింగ్ గ వుంది .. చాలామంది ఫారినర్స్ వచ్చారు .. వాళ్ళు మాతో పాటు అలానే చేసారు ,మా table దగ్గర కూర్చున్నాం. ఈలోపు ఒక షేక్ falcon ని పట్టుకొని అక్కడికొచ్చాడు. అతని దగ్గరికెళ్లి దాన్ని పట్టుకొని ఒక ఫొటో తీసుకున్నాం.ఒక పరుపు లాంటిది కొంచెం ఎత్తులో వేసి, దాని చుట్టు దిండుల్లాంటివి వేసారు. వాటన్నిటినీ ఒక స్టేజ్ చుట్టూ వేసారు.సాయంత్రం కావడంతో ఎడారి లో ఉన్నా హాయిగా చల్లగా మంచి వాతావరణం ఉంది. .ఒకతను డ్యాన్స్ ప్లస్ జిమ్నాస్టిక్స్ టైపులో డాన్సు చేసాడు .. చాల బావుంది .. మను కూడా స్టేజి మిద డాన్సు చేసాడు .. ఫన్నీ గ వుంది ..భోజనం వచ్చి తీస్కెళ్లమని అనౌన్స్ చేసారు.భోజనం కూడా పర్లేదు బానే ఉంది.తినే సరికి రాత్రి 9 అయింది. అందరితో పాటే బయటికి వెళ్ళి మా డ్రైవర్‌ని వెతికి పట్టుకొని రిటర్న్ బయల్దేరాం.
desert safari ఫుల్ గ ఎంజాయ్ చేసాం .. thanks to my brother చిట్టి & his family ,.. manu and sujatha..







No comments:

Post a Comment