Thursday, July 3, 2014

చరిత్రలో ఈ రోజు/జూలై 4

చరిత్రలో ఈ రోజు/జూలై 4:

1963: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మరణం..

1.పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో జననం...
2.మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.
3.19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.
4.1916 లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు
5.వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం
6.కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ {వ్యాఖ్య" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు}.
7.జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది






చరిత్రలో ఈ రోజు/జూలై 4:


1902: ప్రసిద్ధి గాంచిన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద మరణం..


భారతదేశాన్ని ప్రేమించి,భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని


 పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా.అమెరికాలోని

 ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.తిరిగి భారత 

దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా

 నిర్దేశం చేశాడు.


చరిత్రలో ఈ రోజు/జూలై 4:

1933 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జననం.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన 


రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును 

ప్రవేశపెట్టాడు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం 

విశేషం.బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినాడు



చరిత్రలో ఈ రోజు/జూలై 4:

1897: భారత స్వాతంత్ర్యసమరయోధుడు అల్లూరి సీతారామరాజు జననం..

ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక 


అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని 

కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ 

వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన 

అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా

 శక్తిని ఢీకొన్నాడు. 





చరిత్రలో ఈ రోజు/జూలై 4:

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం..

Independence Day in the United States 

అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్రోద్యమం పేరిట బ్రిటిష్


 సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల 

స్వాతంత్ర యుద్ధంగా గుర్తింపు పొందింది..




No comments:

Post a Comment